జనగామ జిల్లా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గగులోత్ నీల (26) ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఆమె తాను పనిచేస్తున్న స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ quarters లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

గగులోత్ నీల 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. చిన్ననాటి నుంచి పోలీస్ శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో ప్రయత్నించి, ఉద్యోగం సాధించిన ఆమె, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతూ వచ్చారు.

అయితే, ఇటీవల తన పెళ్లికి సంబంధించి సంబంధాలు కుదరడం లేదని తీవ్ర మనస్తాపానికి లోనై depressionతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె తీవ్ర ఆవేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నీల మరణం కుటుంబ సభ్యులు, సహచరుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read More : దుబాయ్‌లో తెలుగు వాసులపై దారుణ హత్య — ఆలస్యంగా వెలుగులోకి సంఘటన