ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిపై దుండగుల దాడి.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం ఘోర ఘటన జరిగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని గుర్తుతెలియని దుండగులు కాల్చి హత్య చేశారు. ఈ ఘటనలో నార్త్‌వెస్ట్ డీసీలో ఉన్న జ్యూయిష్ మ్యూజియం సమీపంలో ఉంది. ఇది ఫెడ్‌బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్‌కు కొంత దూరంలోనే జరిగింది.

ఈ దాడిపై అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె జరిగిన ఘటన – “ఇది దారుణమైన ఘటన. ఇద్దరు ఇజ్రాల్ ఎంబాసీ సిబ్బందిని హత్య చేశారు. కానీ, మృతుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

FBI డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ – కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD)తో కలిసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసింది.

దాడి జరిగిన సమయంలో మ్యూజియంలో అమెరికన్ జ్యూయిష్ కమిటీ (AJC) ఆధ్వర్యంలో ఓ కార్య క్రమం జరుగుతుండగా, ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది.

ఈ ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డాన్ తీవ్రంగా ఖండించారు. ఇది యాంటీ-సెమిటిక్ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. “ఇది మానవతను వెనక్కి నెట్టి వేయాలనే కుట్ర,” అని ఆయన ట్వీట్ చేశారు.

అధికారుల ప్రకారం, కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు కంచెతో మూసివేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. పూర్తి సమాచారం త్వరలో వెల్లడి.

Read More : బలూచిస్తాన్‌లో ఆత్మహుతి దాడి

One thought on “ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిపై దుండగుల దాడి.

Comments are closed.