ఒక్క లైక్‌తో నవనీత్ లైఫ్ మార్చిన కోహ్లీ!

Virat Kohli Like Navneet Kaur

విరాట్ కోహ్లీ చేసిన ఒక లైక్‌తో నవనీత్ కౌర్ జీవితం ఒక్క రాత్రిలోనే మారిపోయింది. కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా పొరపాటున ఆమె పోస్టును లైక్ చేయడం వల్ల ఆమెకు ఊహించని పాపులారిటీ వచ్చింది. అదే రోజు అనుష్క శర్మ పుట్టినరోజు కావడం, కోహ్లీ లైక్ కొట్టినప్పుడు ఆమెపై వచ్చిన క్రేజ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.

ఈ విషయంపై కోహ్లీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా, ఈ పొరపాటు నవనీత్‌కు మాత్రం పెద్ద ప్లస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ రాత్రికిరాత్రే పెరిగింది. ట్విట్టర్, ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్లు ఏకంగా 5 లక్షల మంది పెరిగినట్టు సమాచారం.

ఇన్‌స్టాలో హాట్ ఫోటోషూట్స్, వీడియోలతో ఆకట్టుకునే నవనీత్‌కి ఇప్పటికే సినిమా, టీవీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఈ లైక్ వ్యవహారం ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించిన ఆమె, తన ఇన్‌స్టా పోస్టుల కోసం తీసుకునే పారితోషికాన్ని 30 శాతం పెంచేసింది.

ప్రస్తుతం నవనీత్ నికర ఆదాయం రూ.43 కోట్ల వరకు పెరిగిందని సమాచారం. ఒక్క లైక్‌తో ఈ స్థాయి పాపులారిటీ రావడం ఆశ్చర్యంగా ఉన్నా, ఇది సోషల్ మీడియా శక్తిని చాటి చెబుతోంది. కోహ్లీ లైక్ పొరపాటే అయినా, నవనీత్ జీవితానికి మాత్రం భారీ మలుపు ఇచ్చింది.

Read More