మ‌ల‌యాళ న‌టి విన్సీ సోనీ : డ్ర‌గ్స్ తీసుకుని, ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన హీరో!

Vincy Sony Aloshious controversy

మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఇటీవల ఒక తీవ్ర అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె గతంలో ఓ హీరోతో ఉన్న అసౌకర్యకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. సెట్‌లో దూకుడుగా ప్రవర్తించిన ఆ హీరో, డ్రగ్స్ తీసుకుని షూటింగ్‌కు వచ్చి, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని అన్నారు. ఇంతటితో ఆగకుండా, తన ముందే బట్టలు మార్చుకునేందుకు ఒత్తిడి చేశాడని విన్సీ పేర్కొన్నారు.

విన్సీ ఈ విషయంలో చాలా బాధపడుతూ, డ్రగ్స్ అలవాటున్న నటులతో ఇకపై పని చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. “ఈ పరిస్థితి నా వ్యక్తిగత విషయం కాదు, ఇది మనందరికి చాలా దుష్పరిణామాలు తెచ్చే అంశం,” అని ఆమె చెప్పారు. ఈ విషయం గురించి చెప్పడం వల్ల తనకు అవకాశాలు తగ్గే అవకాశం ఉన్నా కూడా, ఆమె దీనిని బయట పెట్టాలని నిర్ణయించుకుంది.

ఈ విషయం గురించి ఎవరూ స్పందించకపోవడం, నిజాయితీగా మాట్లాడకపోవడం ఆమెను బాధించింది. “అది జరిగినా, దానికి ఎవ్వరూ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం,” అని విన్సీ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే మలయాళ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.

2019లో ‘రేఖ’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన విన్సీ, మొదటి చిత్రంతోనే ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు మలయాళ పరిశ్రమలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.

Read More