చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్ -2’ (ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 27న విడుదల కాబోతోంది.
‘పొన్నియిన్ సెల్వన్’ సక్సెస్ తర్వాత తంగలాన్ చిత్రంలో నటుడిగా తన సత్తా చాటినా, ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. అయితే, ‘వీర ధీర సూరన్ -2’ యాక్షన్ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు ఎస్.జె. సూర్య , సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.
తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన లభించడంతో, సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
యాక్షన్, థ్రిల్, ఎమోషన్ కలబోసిన ‘వీర ధీర సూరన్ -2’ సరికొత్త అనుభూతిని ఇస్తుందా? అన్నది ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. మరి విక్రమ్ మరోసారి బ్లాక్‌బస్టర్ అందుకోగలడో చూడాలి!

One thought on “విక్రమ్ ‘వీర ధీర సూరన్ 2’ రిలీజ్‌కి సిద్ధం!”
Comments are closed.