వరుణ్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు:

varun

భారత క్రికెటర్ వరుణ్ చక్రవర్తి 2021 టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత తనపై ఎదురైన అనుభవాల గురించి ఇటీవల సంచలన విషయాలను వెల్లడించారు. UAEలో జరిగిన ఆ టోర్నమెంట్ తర్వాత విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు బైకులపై తనను అనుసరించారని వరుణ్ తెలిపారు. ఆ సమయంలో తన భద్రతపై తీవ్రమైన భయాందోళనకు గురయ్యానని ఆయన చెప్పారు.

వరల్డ్ కప్‌లో భారత జట్టు అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో తనను బలికపశువుగా (స్కేప్‌గోట్) ముద్రవేశారని వరుణ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలో విఫలతకు కారణంగా తనను తప్పుబట్టిన కొంతమంది వ్యక్తులు తీవ్రస్థాయిలో తనను టార్గెట్ చేశారని, అంతేకాకుండా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆయన వెల్లడించారు. ఆ కాల్స్ విన్న తర్వాత తన కుటుంబసభ్యుల భద్రత విషయమై కూడా తనకు గట్టి ఆందోళన కలిగిందని వరుణ్ పేర్కొన్నారు.

“అలాంటి పరిస్థితుల్లో ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా. ఆటలో గెలుపోటములు సహజమే కానీ, ఒకరి మీద పూర్తిగా దోషారోపణ చేయడం బాధాకరం” అని వరుణ్ తెలిపారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత తనపై వచ్చిన ఆ దాడులు, బెదిరింపులు తాను ఎన్నడూ మర్చిపోలేనని వరుణ్ చక్రవర్తి తెలిపారు.

Read More