వరణాసిలో 19ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి..

వరణాసిలో తీవ్ర కలకలం రేపుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 19 ఏళ్ల యువతిపై ఆరుగురికి పైగా మగవారు వరుసగా ఆరో రోజుల పాటు వివిధ హోటళ్లు, క్యాఫేలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన కుమార్తెను ఒకరు బైక్‌పై తీసుకెళ్లి బైక్‌పైనే లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, పూర్తి విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. యువతిని ఎలా ప్రలోభపెట్టారో, ఎవరి పాత్ర ఏంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More : జైపూర్‌లో దారుణం: సామూహిక పెళ్లిళ్ల పేరిట బాలికల అమ్మకాలు!