సాగునీటి కోసం రోడ్డెక్కిన వనపర్తి రైతులు — జూరాల ప్రాజెక్టు వద్ద ఉధృతమైన ధర్నా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జిల్లాలో సాగునీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఆందోళనకు దిగారు. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్‌తో జూరాల ప్రాజెక్టుపై రైతులు భారీగా చేరుకొని ధర్నా నిర్వహించారు.

వనపర్తి జిల్లాలోని గుంటిపల్లి, మోటంపల్లి, ఆరేపల్లి, కట్టేపల్లి, తూంపల్లి గ్రామాల రైతులు — తమ పంటలు నీటి లేమితో ఎండిపోతున్న పరిస్థితిని అధికారులు గమనించి, వెంటనే జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. సాగునీరు లేక పంటలు నష్టపోతున్నాయని, ఇలాంటి దశలో నీరు వదిలితేనే రైతులకు కొంత ఊరట కలుగుతుందని వారు విన్నవించారు.

పోలీసులు ధర్నా చేస్తున్న రైతులను సమాధానపడే ప్రయత్నం చేసినప్పటికీ, నీరు వదిలే వరకు ధర్నా విరమించమంటూ రైతులు స్పష్టంగా వెల్లడించారు. తమ విన్నపాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, నీరు వదిలి రైతులను ఆదుకోవాలని కోరుతూ వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Read More : కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి కౌంటర్..

One thought on “సాగునీటి కోసం రోడ్డెక్కిన వనపర్తి రైతులు — జూరాల ప్రాజెక్టు వద్ద ఉధృతమైన ధర్నా

Comments are closed.