దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాంకేతిక లోపాల కారణంగా యూపీఐ సేవలు పనిచేయకపోవడం వల్ల డిజిటల్ లావాదేవీలు నిలిచిపోయినట్టు వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, పేట్రోల్ బంకులు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో యూపీఐ చెల్లింపులు విఫలమవుతున్న నేపథ్యంలో, నగదు లేదా డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో తాత్కాలికంగా అయినా డిజిటల్ చెల్లింపులకు ప్రత్యామ్నాయంగా వాలెట్ లేదా నగదు తగినన్ని తీసుకెళ్లడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. యూపీఐ సేవల పునరుద్ధరణ కోసం సంబంధిత బ్యాంకులు మరియు టెక్నికల్ టీమ్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయని సమాచారం.
Read More : UPI లావాదేవీలపై మార్పులు?

One thought on “డిజిటల్ లావాదేవీలకు అనువైన యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం ఏర్పడింది.”
Comments are closed.