ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భూపేంద్ర సింగ్ అనే యువకుడు స్కామర్‌ను తానే మోసం చేసిన ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
భూపేంద్ర సింగ్‌కు ఓ రోజు సీబీఐ (CBI) అధికారి అంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. “నీ అభ్యంతరకర వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అవి కేసుగా నమోదు కాకుండా ఉండాలంటే రూ. 16 వేలు ఇవ్వాలి” అంటూ బెదిరించాడు.
స్కామర్‌ను ఆట పట్టించాలనుకున్న యువకుడు
స్కామర్ మాయలో పడకుండా భూపేంద్ర సింగ్ ఆ కాల్‌ను స్కామ్ కాల్ అని గమనించి, ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కామర్‌తో మాట్లాడుతూ “దయచేసి మా అమ్మకు ఈ వీడియోల గురించి చెప్పొద్దు. మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతా” అని భయపడినట్లు నటించాడు.
ఆ మాటలు నమ్మిన స్కామర్, “చెప్పను కానీ డబ్బులు ఇవ్వాల్సిందే” అని కోరాడు. దీంతో భూపేంద్ర సింగ్, తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి రూ. 3,000 అవసరమని చెప్పాడు. ఆ గొలుసు విడిపించి స్కామర్‌కు డబ్బులు ఇస్తానని నమ్మించాడు.
స్కామర్‌ను మోసం చేసిన తెలివితేటలు
యువకుడి మాటలను నమ్మిన స్కామర్ తొలుత రూ. 3,000 పంపాడు. ఆపై భూపేంద్ర సింగ్ మరింత నాటకమాడుతూ, తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసును ఇవ్వడం లేదని, మీరు నా తండ్రిలా వ్యాపారితో మాట్లాడాలని స్కామర్‌ను నమ్మించాడు.
ఆ మాటలకే కాకుండా, యువకుడు తన స్నేహితుడిని నగల వ్యాపారిగా నటించాలని చెప్పి, స్కామర్‌ను మరో రూ. 4,480 అందజేయించాడు. అంతే కాకుండా, గొలుసుపై రూ. 1.10 లక్షల రుణం ఇప్పించడానికి రూ. 3,000 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని చెప్పి మొత్తంగా రూ. 10 వేలు స్కామర్ వద్ద నుంచి పొందాడు.
చివరికి తనే మోసపోయానని గ్రహించిన స్కామర్
తాను మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని భూపేంద్ర సింగ్‌ను బ్రతిమాలాడు. అయితే భూపేంద్ర సింగ్ ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు. అందులోనూ ఆ రూ. 10 వేలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుని తన మంచి మనసును చాటుకున్నాడు.

One thought on “స్కామర్‌ను ఆటపట్టించిన యువకుడు: భూపేంద్ర సింగ్ తెలివిగా స్కామర్‌ను మోసం చేసిన వింత ఘటన”
Comments are closed.