ట్రంప్ తీవ్ర విమర్శలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదని పేర్కొన్నారు.

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భారీ వైమానిక దాడుల్లో చిన్నారులతో సహా పౌరులు మరణించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ట్రూత్ సోషల్’ అనే తన సోషల్ మీడియా వేదికలో స్పందించిన ట్రంప్… పుతిన్ గురించి మాట్లాడుతూ, “ఆయనకు పూర్తిగా మతి భ్రమించిపోయింది. తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన విచక్షణా కోల్పోయారు. రష్యా సైనికులు అనవసరంగా ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుతిన్ ఉక్రెయిన్‌లో కొంత భాగం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నారని తాను మునుపు నుంచి చెబుతున్నానని ట్రంప్ అన్నారు. అదే జరిగితే అది రష్యా పతనానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలు తన దేశానికి మేలు చేయడం లేదని, అతని మాటలు సమస్యలకు దారి తీస్తున్నాయని మండిపడ్డారు. “యుద్ధం ప్రారంభమైన సమయంలో నేను అధికారంలో ఉన్నట్లయితే ఇది జరగేది కాదు” అని స్పష్టం చేశారు.

పుతిన్ పై విమర్శలు గుప్పించిన ట్రంప్, అతను అనేక మంది పౌరులను చంపుతున్నాడని, తనకు ఇది బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ యుద్ధానికి జెలెన్‌స్కీ, పుతిన్, జో బైడెన్‌లు బాధ్యత వహించాలన్నారు. తాను మాత్రం దీనికి బాధ్యుడు కాదని, కేవలం శాంతిని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నానని స్పష్టం చేశారు.

ఇటీవల రష్యా జరిపిన హింసాత్మక దాడుల్లో ఉక్రెయిన్‌లో ఎనిమిదేళ్ల బాలిక, పన్నెండేళ్ల బాలుడు, 17 ఏళ్ల యువకుడు మరణించినట్లు సమాచారం. రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే ఈ విషయంలో ట్రంప్ అభిప్రాయం, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అభిప్రాయంతో భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read More : భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

One thought on “ట్రంప్ తీవ్ర విమర్శలు

Comments are closed.