వైఎస్ జగన్‌పై రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఖండించారు. జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికే ఎస్సై ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య హత్యకు సుధాకర్ యాదవే కారణమంటూ తోపుదుర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ చేసిన “పోలీసుల బట్టలూడదీస్తాం” వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు చేస్తుండగా, తోపుదుర్తి మాత్రం జగన్‌ను సమర్థిస్తూ — ప్రజల కోసమే ఆయన పక్షపాత లేని పోలీసింగ్‌పై సూచనలు చేశారని వివరించారు. చంద్రబాబు గతంలో చేసిన పోలీసులపై వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో పోలీసులు ఆంక్షలు ఎందుకు విధించారని కూడా నిలదీశారు.
Read More : రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం..
Watch Our YouTube Channel Click Here

One thought on “రామగిరి ఎస్సై వ్యాఖ్యలపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందన”
Comments are closed.