గట్టి పోటీకి సిద్ధం!

anand mahindra

ఆనంద్ మహీంద్రా: టెస్లా భారత్‌ మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తున్నా తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.

విద్యుత్ వాహనాల రంగంలో టెస్లాకు గట్టి పోటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో ప్రవేశించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా పోటీ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.

టెస్లా ఎంట్రీపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్

‘‘1991 ఆర్థిక సంస్కరణల సమయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. టాటా, మారుతీ, బహుళజాతి సంస్థలు (MNCs) భారత మార్కెట్లోకి వస్తే మేమెలా నిలదొక్కుకుంటామన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ మేమిప్పటికీ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో దృఢంగా ఉన్నాము. మేము మరో 100 సంవత్సరాలు కొనసాగడానికి కృషి చేస్తూనే ఉంటాం. మీ మద్దతుతో దీన్ని సాధ్యంగా చేసి చూపుతాం’’ అని ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

Read More