తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని కోర్టు మండిపడింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరో 60 రోజుల సమయం అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టును కోరింది. గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినట్లు తెలిసింది.
Read More : హైదరాబాద్ మెట్రో రెండో దశకు వేగం

One thought on “సర్పంచ్ ఎన్నికల జాప్యం పై హైకోర్టు ఆగ్రహం”
Comments are closed.