తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగండ్ల వర్షాల కారణంగా రైతులకు జరిగిన పంట నష్టాన్ని గుర్తించి, పరిహారం నిధులను బుధవారం విడుదల చేసింది.
ఇటీవలి వడగండ్ల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లోని సుమారు 5,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం రూ. 51.52 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసింది.
ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇంకా మే నెలలో పంటలకు సంభవించిన నష్టానికి సంబంధించిన పరిహారం త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
రైతులను ఆర్థికంగా ఆదుకునే దిశగా ప్రభుత్వం త్వరితగతిన స్పందించడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : రేవంత్ రెడ్డి BRS ప్రభుత్వంపై ఘన విమర్శలు

One thought on “రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త”
Comments are closed.