ఎన్ఆర్‌ఐ మురళీ మోహన్ చౌదరికి న్యాయం దక్కుతుందా?

చిలకలూరిపేటలో టీడీపీ నేతలపై కబ్జా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక టీడీపీ కార్యకర్త, ఎన్ఆర్‌ఐ అయిన మురళీ మోహన్ చౌదరికి చెందిన కాంప్లెక్స్‌ను టీడీపీ నేతలు అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కాంప్లెక్స్‌ వ్యవహారంలో సెటిల్‌మెంట్ కోసం నారా లోకేష్‌కు చెందిన బినామీకి రూ.22 లక్షలు ఇచ్చినప్పటికీ, అప్పటి నుంచి తమ సమస్యను ఎవ్వరూ పరిష్కరించలేదని బాధితుడు మురళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నారా లోకేష్‌తో చాట్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసిన ఆయన, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక తాను మోసపోయానని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల మురళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమ కాంప్లెక్స్‌లోకి కస్టమర్లు కూడా రాకుండా టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

‘‘నన్ను, నా 70 ఏళ్ల తల్లిని ఇబ్బందులకు గురిచేశారు. అయినా నేను భయపడను. నా హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తాను’’ అని మురళీ మోహన్ చౌదరి ధైర్యంగా తెలిపారు.

ఈ వ్యవహారం ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Read More : చంద్రబాబును ప్రశ్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు