రాజ్యసభలో ఎంపురాన్ వివాదం – సురేష్ గోపి తీవ్రస్థాయిలో స్పందన

Suresh Gopi Response on Empuraan Controversy

మాలీవుడ్ మూవీ ఎంపురాన్ వివాదం రాజ్యసభ వరకూ వెళ్లింది. కొందరు సభ్యులు ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మాలీవుడ్ యాక్టర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి కఠినంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో రాజకీయ నాయకుడు టీపీ చంద్రశేఖరన్ జీవితంపై తీసిన TP 51 మూవీని రీ-రిస్లీ చేయడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? అలాగే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసే దమ్ముందా? అంటూ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేరళ ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ నిలదీశారు.

సభలో ఆయన మాట్లాడుతుండగా, విపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని స్పీకర్‌కు వివరించారు. ఎంపురాన్ నిర్మాతలపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని, తనకు వివాదం గురించి తెలిసిన వెంటనే నిర్మాతలను సంప్రదించానని చెప్పారు. సినిమాకు తన పేరును అనవసరంగా లింక్ చేయొద్దని స్పష్టంగా తెలిపినట్లు వెల్లడించారు. ఈ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ సురేష్ గోపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మోహన్‌లాల్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని, భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమే ఈ వివాదానికి అసలు కారణమని అన్నారు. రాజ్యసభలో జరిగిన ఈ ఘర్షణ రాజకీయంగా పెద్ద చర్చగా మారింది.

Read More

One thought on “రాజ్యసభలో ఎంపురాన్ వివాదం – సురేష్ గోపి తీవ్రస్థాయిలో స్పందన

Comments are closed.