వాహనాలను ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా నడిపి జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి బీమా వర్తించదన్న కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ కేసు నేపథ్యం ప్రకారం… కర్ణాటకకు చెందిన రవిషా అనే వ్యక్తి 2014లో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని కుటుంబసభ్యులు రూ.80 లక్షల బీమా క్లెయిమ్ కోసం మొదట కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి, బాధ్యతారహితంగా వాహనం నడిపిన వ్యక్తికి బీమా వర్తించదంటూ హైకోర్టు క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు… హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన సందర్భాల్లో బీమా కంపెనీలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో భవిష్యత్తులో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
Read More : అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసిన స్టార్టప్ యజమాని
