ప్రసిద్ధ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు విశాఖపట్నంలోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. దాదాపు నెలరోజులుగా కనిపించకపోవడంతో అతడి ఆచూకీపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, ఆయన తిరిగి మెరుస్తూ సందడి చేశారు.
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న సన్నీ భయ్యా, గుడి గోపురం ఎదుట నమస్కారం పెడుతూ దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ “నేను వచ్చేశాను” అంటూ పోస్ట్ చేశారు. దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘సన్నీ మిస్సింగ్’ వార్తలకు తెరపడింది.
గత నెలలో చెన్నై ఎయిర్పోర్టులో కనిపించకుండా పోయిన సన్నీ భయ్యా… ఎన్ఐఏ అదుపులో ఉన్నాడన్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పని చేస్తున్నాడన్న ఆరోపణలతో పాటు, దుబాయ్ మీదుగా భారత్ వచ్చిన వెంటనే ఎన్ఐఏ అరెస్టు చేసిందన్న కథనాలు వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులకే సమాచారం లేకపోవడంతో ఆందోళన మరింత తీవ్రమైంది.
ఈ నేపథ్యంలో ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ కూడా పలు ఆరోపణలతో వీడియోలు పోస్టు చేయడం, తన వద్ద ఆధారాలున్నాయని చెప్పడం మరో దుమారానికి దారి తీసింది. అయితే, సన్నీ భయ్యా సింహాచలంలో ప్రత్యక్షమవడంతో ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు పలికినట్లయ్యింది.
ప్రస్తుతం అతడు తిరిగి వచ్చిన ఆనందంలో అభిమానులు, యూట్యూబ్ కమ్యూనిటీ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read More : పరిగిలో దారుణ హత్య:

2 thoughts on “యూట్యూబర్ సన్నీ భయ్యా ప్రత్యక్షం”
Comments are closed.