టాలీవుడ్ హీరో సుహాస్ తమిళంలో విలన్.. ఫస్ట్ లుక్

Suhas Tamil debut in Mandadi

టాలీవుడ్‌లో విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. అతడి తొలి తమిళ చిత్రం ‘మండాడి’లో సుహాస్ ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాత ఎల్ రెడ్ కుమార్ సమర్పణలో, మతిమరన్ పుగజెంది దర్శకత్వంలో రూపొందుతోంది.

ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా కాగా, సూరి హీరోగా నటిస్తున్నాడు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

సముద్ర తీరంలో జట్టుతో పాటు రగ్గడ్ లుక్‌లో కనిపించిన సుహాస్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సూరి, సుహాస్‌ల మధ్య సీరియస్ క్లాష్ ఈ చిత్రానికి హైలైట్ కానుందని తెలుస్తోంది. సినిమా కేవలం క్రీడా నేపథ్యంగా కాకుండా, బలమైన భావోద్వేగాలను చుట్టుముట్టిన కథతో ముందుకు సాగనుంది.

ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కతిర్, యాక్షన్ కొరియోగ్రఫీ పీటర్ హెయిన్ అందిస్తున్నారు. అచ్యుత్ కుమార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘మండాడి’ 2025 ఆగస్టు 15న విడుదల కానుంది.

Read More

One thought on “టాలీవుడ్ హీరో సుహాస్ తమిళంలో విలన్.. ఫస్ట్ లుక్

Comments are closed.