సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం, నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తులు నియమం
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను అనుసరించి రాష్ట్ర హైకోర్టుకు నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నర్సింగ్రావు నందికొండ, హైకోర్టు రిజొస్టార్ జనరల్ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిస్టార్ (అడ్మినిస్ట్రేషన్) మధుసూదన్రావు బొబ్బిలి రామయ్య వంటి నలుగురు న్యాయమూర్తులను 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపిక చేయడం జరిగింది. వీరంతా 2026 జూన్ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు.
ఈ విధంగా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరగా, ఇంకా 12 ఖాళీలను భర్తీ చేయాలనుకుంటున్నారు.
