ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్’ చిత్రానికి సంబంధించిన ఓ తాజా వార్త సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందుగా ఈ సినిమాకి కంపోజ్ చేసిన పాటలను పూర్తిగా స్క్రాప్ చేసి, మళ్లీ కొత్తగా కంపోజ్ చేస్తున్నట్టు తెలిపారు.
థమన్ మాట్లాడుతూ – “మేము ‘రాజా సాబ్’ కోసం కొంతకాలం క్రితమే పాటలు కంపోజ్ చేశాం. అయితే అవి ఇంకా షూట్ చేయలేదు. ఈ క్రమంలో అవి తాజాదనాన్ని కోల్పోయాయని భావించాను. అందుకే ఆ ట్యూన్స్‌ను పక్కన పెట్టి, ఇప్పుడు మళ్లీ కొత్త పాటలను కంపోజ్ చేస్తున్నాం” అని తెలిపారు.
ప్రస్తుతం ‘రాజా సాబ్’ చిత్రం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని సమాచారం. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

One thought on “ఎస్‌ఎస్ థమన్ ‘రాజా సాబ్’ పాటలను మళ్లీ కంపోజ్ చేస్తున్నాడట!”
Comments are closed.