ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు అధికారులు మొత్తం 10 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి జూరాల, సుంకేసుల నుంచి 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read More : సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా పాందువ్వ శ్రీను నియామకం

2 thoughts on “శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 10 గేట్లు ఎత్తివేత”
Comments are closed.