జీన్స్ ధరించవచ్చా? చిదానంద సరస్వతి సమాధానం!

Spirituality and Clothing

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న పరమార్థ నికేతన్ ఆశ్రమ గురువు చిదానంద సరస్వతి, ఆధ్యాత్మికతను అనుసరించే వ్యక్తి దుస్తుల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లు, “ఆధ్యాత్మికత వైపు దృష్టిసారించాలంటే ఏ దుస్తులు ధరించాలి?” అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఆయన తనదైన దృష్టిని పంచుకున్నారు.

చిదానంద సరస్వతి, కుంభమేళా సమయంలో ఒక యువకుడి ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ యువకుడు తన దుస్తుల ఎంపిక గురించి సందేహం వ్యక్తం చేస్తూ, జీన్స్ వదిలి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలా? అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

“ఏ దుస్తులు ధరిస్తున్నారనే విషయం కాదు, ఎలాంటి విలువలు పాటిస్తున్నారన్నది ముఖ్యమైంది,” అని చిదానంద సరస్వతి పేర్కొన్నారు. కుంభమేళాకు జీన్స్ ధరించి వచ్చినవారిని చూసి, ఆయన ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే, వ్యక్తులు తమ మూలాలను, సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నిరంజని అఖాడా అధిపతి స్వామి కైలాసానంద గిరి కూడా పాల్గొనగా, ఆయన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా కుంభమేళాకు రావాలని భావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ప్రశంసలు కురిపించారు.

Read More