సౌత్ కొరియాలో ఓ భారీ విమాన ప్రమాదం కలకలం రేపింది. దేశంలోని పోహాంగ్ నగర సమీపంలోని సైనిక స్థావరం వద్ద నావికాదళానికి చెందిన P-3 మోడల్ విమానం ఒక్కసారిగా నియంత్రణ తప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదం గురువారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో ఆ విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా విమానం కుప్పకూలిన ప్రాంతం పర్వత ప్రాంతమై ఉండడంతో సహాయక చర్యల్లో కొంత ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు గల కారణాలపై ప్రాథమిక విచారణ కొనసాగుతోంది. మెకానికల్ లోపమా? వాతావరణ కారణమా? లేక మరే ఇతర కారణమా అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం నిజమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read More : అమెరికాతో చర్చల్లో టారిఫ్ ప్రస్తావన లేదు: భారత్ స్పష్టత.

One thought on “సౌత్ కొరియాలో సైనిక విమాన ప్రమాదం”
Comments are closed.