గంగూలీ బయోపిక్‌: విక్రమాదిత్య మోత్వానే మేజిక్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు!

Sourav Ganguly Biopic

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ బయోపిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌లో 60 నుండి 75 రోజుల పాటు కీలక సన్నివేశాలు, టాకీ పార్ట్‌తో పాటు క్రికెట్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు.


ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందనే చర్చలు సుదీర్ఘ కాలం కొనసాగాయి. రణబీర్ కపూర్, ఇతర యంగ్ హీరోల పేర్లు పరిశీలించబడినప్పటికీ, గంగూలీ ఎలివేషన్‌కు సరిపోయే ఎనర్జీ, లుక్ ఉన్న నటుడిగా రాజ్ కుమార్ రావు ఎంపికైనట్లు సమాచారం. గంగూలీ జీవితం చుట్టూ నడిచే ఈ సినిమా, కేవలం క్రీడా జీవితానికే పరిమితం కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర ఘటనలను కూడా ప్రదర్శించనుంది. ముఖ్యంగా 2002లో లార్డ్స్ మైదానంలో గంగూలీ షర్ట్ విప్పి సంబరాలు చేసుకున్న ఐకానిక్ మోమెంట్‌ను మళ్లీ తెరపై చూపించేందుకు పెద్ద సెటప్‌ ను రూపొందిస్తున్నారు.

గంగూలీ బయోపిక్‌ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండటం సహజమే. క్రికెట్‌లో గంగూలీ చూపించిన దైర్యం, స్ఫూర్తిని ఈ సినిమాతో ప్రేక్షకులకు చేరవేయాలని దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే లక్ష్యంగా పెట్టుకున్నారు. గంగూలీ జీవితంలోని విజయాలు, కఠిన సమయాలు, మ్యాచ్‌లు, అలాగే వ్యక్తిగత జీవితంలోని సంఘటనలు ఈ సినిమాను మరింత ప్రత్యేకతనిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

Read More

One thought on “గంగూలీ బయోపిక్‌: విక్రమాదిత్య మోత్వానే మేజిక్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు!

Comments are closed.