సోనాలి బింద్రే ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో మెప్పించింది. అయితే ఇటీవల అమెజాన్ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన కెరీర్‌లో ఒక కన్నడ సినిమాలో నటించినప్పుడు చేదు అనుభవం ఎదురైందని, ఆ సంఘటన తర్వాత కన్నడ సినిమాలకు గుడ్‌బై చెప్పేశానని సోనాలి తెలిపారు. ఏ అనుభవం కలిగిందో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, తన నిర్ణయం అంతుచిక్కని అంశంగా మారింది.
సోనాలి బింద్రే కన్నడ చిత్ర పరిశ్రమలో నటించిన ఏకైక చిత్రం ‘ప్రీత్సే’. ఈ సినిమా బాలీవుడ్ క్లాసిక్ “డర్” రీమేక్ కాగా, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే చేదు అనుభవం ఎదురైందని సోనాలి చెప్పడం ఆసక్తికరం. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె “మురారి” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించిన సోనాలి, 2004లో విడుదలైన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది.
ప్రస్తుతం బాలీవుడ్ నటీమణులు దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్న సమయంలో, సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎక్కువని చాలామంది భావిస్తున్నారు. కానీ సోనాలి చెదురుమనిపించిన చేదు అనుభవం, నటీమణుల కోసం సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.

One thought on “సోనాలి బింద్రే చేదు అనుభవం: కన్నడ సినిమాలకు గుడ్‌బై చెప్పిన స్టార్ హీరోయిన్”
Comments are closed.