విడాకుల పుకార్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన సోనాక్షి సిన్హా!

Sonakshi Sinha Divorce Rumors Response

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన సహనటుడు జహీర్ ఇక్బాల్‌ను మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం సోనాక్షి కుటుంబంలో కొంత కలకలం సృష్టించినప్పటికీ, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా పెళ్లి వేడుకలో వారిని ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం సోనాక్షి కుటుంబంలో పరిస్థితులు మామూలు అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ ఆగకపోవడం గమనార్హం.

వివాహానికి ముందే సోషల్ మీడియా విమర్శలను ఊహించిన సోనాక్షి, తన ఖాతాలో వ్యాఖ్యలు లాక్ చేసి కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే పంచుకున్నారు. ప్రస్తుతం భర్త జహీర్‌తో కలిసి గడిపిన ఆనంద క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ అవివేకపూరితంగా ‘‘విడాకులు మీకు దగ్గరగా ఉన్నాయి’’ అంటూ కామెంట్ చేశాడు.

ఈ వ్యాఖ్యపై సోనాక్షి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ముందుగా మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటారు, తర్వాత మేము చూస్తాం!’’ అంటూ గట్టిగా స్పందించారు. పెళ్లి సమయంలో కూడా ట్రోలింగ్‌ను ఖండించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా, వివాహం వ్యక్తిగత నిర్ణయమని, ఇతరులకు ఆ విమర్శించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రైవేట్ జీవితంలో జహీర్‌తో ఏడేళ్ల ప్రేమలో ఉన్న సోనాక్షి, 2024 జూన్ 23న వివాహం చేసుకున్నారు. జహీర్ ఇంట్లో జరిగిన వివాహానికి తరువాత, సినిమా రంగ స్నేహితుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. వృత్తి పరంగా చూస్తే, సోనాక్షి ఇటీవల తన తొలి తెలుగు చిత్రం ‘జటాధార’ షూటింగ్‌ను పూర్తి చేశారు.

Read More


One thought on “విడాకుల పుకార్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన సోనాక్షి సిన్హా!

Comments are closed.