వన్డే మ్యాచ్ మధ్యలో పాము హల్‌చల్

బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఒక పెద్ద పాము అకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించింది. దీంతో ఆటను తాత్కాలికంగా నిలిపి, గ్రౌండ్ స్టాఫ్ పామును అప్రమత్తంగా బయటకు తరిమారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తరచూ బంగ్లా క్రికెటర్లు గెలిచిన తర్వాత ‘నాగిని డాన్స్’ చేస్తుంటారు. దీంతో, “బంగ్లా ఆటగాళ్లకు మద్దతుగా పాము మైదానంలోకి వచ్చింది” అంటూ నెటిజన్లు ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రోజు బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. పాము వచ్చిందంటే గెలుస్తారనుకున్న అభిమానులు నిరాశ చెందారు. మొత్తానికి ఈ ఘటన మ్యాచ్‌కు మరో ప్రత్యేకతగా నిలిచింది.

Read More : నా కెరీర్ ముగిసిందని ఆ రోజే తెలిసింది: ధావన్

One thought on “వన్డే మ్యాచ్ మధ్యలో పాము హల్‌చల్

Comments are closed.