భారతీయుల నిద్రపాటు పట్టణ జీవనశైలి, పని ఒత్తిడులు, సమకాలీన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా తగ్గిపోతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, దాదాపు 59 శాతం మంది భారతీయులు రోజుకు కేవలం 6 గంటల మాత్రమే నిద్రిస్తున్నారని తేలింది. నిద్ర సమయం తగ్గిపోవడం వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.
ముఖ్యంగా నిద్రలేమి కారణంగా హార్మోన్ల అసమతుల్యత, నరాల సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలు వ్యక్తుల దైనందిన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నిద్రలేమి కారణంగా ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక స్థిరత్వం కోల్పోవడం, మతిమరుపు, శారీరక దుబంధత వంటి సమస్యలు కూడా వ్యక్తుల్లో కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఉద్యోగస్తులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారు, విద్యార్థులు ఎక్కువగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక పరికరాల అధిక వినియోగం, మొబైల్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్లను నిద్ర ముందు ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర సమయాన్ని మెరుగుపరచుకోవాలంటే నిద్రకు ముందు డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, సాయంత్రం తర్వాత ఎక్కువ కాఫీ లేదా టీ తీసుకోకూడదని, నిద్రకు ముందు రిలాక్సింగ్ మ్యూజిక్ విన్నా లేదా ధ్యానం చేసినా మెరుగైన నిద్రను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

One thought on “భారతీయుల నిద్రలేమి పెరుగుదల.. ఆరోగ్య సమస్యలు ముంచుతాయేమో?”
Comments are closed.