శింబు తన తాజా చిత్రం “థగ్ లైఫ్” ప్రమోషన్స్ లో పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసారు. పెళ్లి తప్పుకాదు, కానీ పరస్పర అవగాహన లేకపోవడమే అసలైన సమస్య, ప్రతి వ్యక్తీ తన జీవితం మరియు ప్రాధాన్యతలపై మాత్రమే దృష్టి పెడుతూ, ఒకరినొకరు అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. వివాహం ఓ తక్షణ నిర్ణయం కాదని, సరైన సమయంలోనే అది జరుగుతుందని శింబు అభిప్రాయపడ్డారు.
ఇటీవల శింబు మరియు నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టడంతో శింబు టీం వాటిని ఖండించింది. థగ్ లైఫ్ మూవీలో కీలకపాత్ర పోషించిన త్రిష సైతం పెళ్లి గురించి స్పందిస్తూ దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదని అది జరిగితే మంచిది జరగకపోయినా కూడా సరే అని చెప్పారు. ఈ థగ్ లైఫ్ జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SilambarasanTR About Marriage..💥
— Laxmi Kanth (@iammoviebuff007) April 22, 2025
"Marriage is not a Problem.. It's the Person.. When the Time Comes, The right companion will come.. Then the things will be fine.."pic.twitter.com/t2unkTIY9N

One thought on “పెళ్లిపై థగ్ లైఫ్ నటుడి హాట్ కామెంట్స్”
Comments are closed.