సీనియర్ హీరో కుమార్తెగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్, అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్లో భారీ ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత వరుస విజయాలతో ముందుకెళ్లింది.

ఇటీవల ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించి పాన్-ఇండియా స్టార్‌గా మరింత స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

శృతిహాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ఎక్కువగా బ్లాక్ డ్రెస్‌లలో కనిపించే ఈ భామ, తాజాగా రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటనా ప్రతిభతో పాటు, శృతిహాసన్ మంచి సింగర్ కూడా. అనేక సినిమాల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది.


One thought on “స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొత్త ఫొటోలు వైరల్!”
Comments are closed.