సుమారు రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న శృతి హాసన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 2023లో విడుదలైన ‘సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్’ తర్వాత తెరపై కనిపించని శృతి, ఇప్పుడు ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ఆమె కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ సపోర్టింగ్ రోల్‌లో, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.
‘కూలీ’ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇటీవల శృతి హాసన్ ‘కూలీ’ సినిమాలో తన పాత్ర డబ్బింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.
తన సినిమాల పరంగా మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌లో సింగర్‌గా కూడా శృతి హాసన్ తనదైన ముద్ర వేసింది. ‘కూలీ’లో ఆమె పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని చిత్రబృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో శృతి అభిమానులు ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

One thought on “తిరిగి ఫామ్‌లోకి శృతి.. కూలీ డబ్బింగ్ స్టార్ట్!”
Comments are closed.