ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందనను అందుకుంటోంది. తమిళ నటుడు ధనుష్, నటసామ్రాట్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రేక్షకులు సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందంటూ అభిప్రాయపడుతున్నారు. సినిమా కథన శైలి, నటీనటుల ప్రదర్శన, శేఖర్ కమ్ముల వినూత్న దృష్టికోణం సినిమాకు ప్లస్ అయ్యాయని అభిమానులు చెబుతున్నారు. విదేశాల్లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం.
ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూసారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘కుబేర’ చిత్రాన్ని వీక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విడుదలైన తొలి షో నుంచే ‘కుబేర’కు పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులు సైతం సినిమాపై మంచి అభిప్రాయం వ్యక్తం చేయడం చిత్ర యూనిట్‌కు ఊరటను కలిగించింది. సమర్థవంతమైన దర్శకత్వం, గంభీరమైన కథా నిర్మాణం, అద్భుత నటన కలబోతగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

One thought on “శేఖర్ కమ్ముల ‘కుబేర’కు అద్భుత స్పందన”
Comments are closed.