స్టార్ హీరోయిన్లకు ధీటైన అందం, ఆకర్షణ సొంతం చేసుకున్న సారా టెండూల్కర్ ఇప్పటి వరకు సినీ ఆరంగేట్రం చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. మోడలింగ్‌లో తన ప్రతిభను చాటుతున్న సారా, వాణిజ్య ప్రకటనల ద్వారా అభిమానులను ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, జాన్వీ కపూర్లతో సన్నిహితంగా ఉండినా, నటనలో అడుగుపెట్టడం పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనేక ప్రశ్నలను రేపుతోంది.
సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. జెట్‌సింథసిస్ ఆధారిత ఈ లీగ్‌లో 300 మిలియన్లకు పైగా లైఫ్‌టైమ్ డౌన్లోడ్లు ఉన్నాయి. అయితే సారా ఇ-క్రికెట్‌ను ప్రోత్సహించడం వల్ల సినీ రంగానికి నష్టం జరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ వంటి క్రికెట్ టోర్నమెంట్ల కారణంగా థియేటర్ ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండగా, ఇప్పుడు వీడియో ఆధారిత ఈ-క్రికెట్ కి సారా మద్దతు ఇవ్వడం సినీరంగానికి అన్యాయం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ఇప్పటికే సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోవడం, పెరిగిన టికెట్ ధరలు, కుటుంబాలు ఇంటికే పరిమితం కావడం వంటి సమస్యలు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంల అభివృద్ధి సినీరంగానికి సవాలుగా మారింది. ఇలాంటి సమయంలో ఇ-క్రికెట్‌ను ప్రోత్సహించడం నిజమైన వినోద రంగమైన సినిమా పరిశ్రమకు ముప్పు కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీలు ఇతర రంగాలకు మద్దతు ఇస్తే, సినీరంగం మరింత కష్టాల్లో పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

One thought on “సారా టెండూల్కర్ సినీ రంగానికి దూరం: అభిమానుల అసంతృప్తి”
Comments are closed.