తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చి బాలీవుడ్‌లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆమెకు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, అనుకోని షాకులు తగలడం కొనసాగుతోంది. ‘ఖుషీ’ సినిమా తర్వాత తెలుగులో కనిపించిన సమంత, బాలీవుడ్ పెద్ద తెరపై మాత్రం మెరాయలేదు.
ఓటీటీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న సమంత, అందరి అంచనాల ప్రకారం ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని భావించారు. కానీ ప్రస్తుతం సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయ్యినప్పటికీ, అందులో సమంత జాడ కనిపించకపోవడం గమనార్హం. మనోజ్ బాజ్ పాయ్ ఇంటర్వ్యూల్లో ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
అలాగే, హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ అయిన ‘సిటాడెల్’ హిందీ వెర్షన్‌లో ప్రధాన పాత్రలో నటించినా, మిక్స్‌డ్ రెస్పాన్స్ కారణంగా రాజ్ అండ్ డీకే సీజన్ 2ను రద్దు చేశారు. తన సొంత బ్యానర్ ట్రాలాల మూవీస్ పిక్చర్స్ ద్వారా రూపొందిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కూడా ఎలాంటి కొత్త అప్‌డేట్ లేదు.
ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘రక్త బ్రహ్మాండ్’. సినిమాలు గానీ, వెబ్ సిరీస్‌లు గానీ లేకపోవడంతో సమంత మళ్లీ డైలమాలో పడినట్టుగా కనిపిస్తోంది. ‘ఖుషీ’ తర్వాత అమెరికా నుంచి ముంబై చేరిన ఆమె ప్రయాణం ఇలానే కొనసాగుతోంది.

One thought on “ప్రాజెక్ట్స్ మిస్, అవకాశాల లోటు: బాలీవుడ్ లో సమంత పరిస్థితి!”
Comments are closed.