సమంత–రాజ్ నిడిమోరు గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్ .

స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ గాసిప్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సమంత తన దుబాయ్ పర్యటన వీడియోను షేర్ చేసిన కొద్ది గంటలకే, రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిన్న సమంత తన దుబాయ్ ట్రిప్‌కు సంబంధించిన రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రాజ్ నిడిమోరు ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, ఆయన కూడా ఆ ట్రిప్‌లో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, శ్యామలీ దే ‘విరక్తి’పై ఒక కోటేషన్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.

“విరక్తి అంటే ఏమీ లేకపోవడం కాదు, ఏదీ నిన్ను సొంతం చేసుకోకూడదనేదే నిజమైన విరక్తి” అని ఆమె పోస్ట్ చేయడం గమనార్హం. దీంతో ఈ రెండు సంఘటనలను అనుసంధానం చేస్తూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్టుల్లో ఇద్దరూ కలిసి పనిచేయడం, విమానంలో రాజ్ భుజంపై సమంత తల వాల్చిన ఫొటో బయటకు రావడం, పలు ఈవెంట్స్‌లో కలసి కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి.

అయితే తమ సంబంధంపై సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. తాజా పరిణామంతో ఈ గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.

Read More : షౌబిన్ షాహిర్ దుబాయ్ పర్యటనను కోర్టు అడ్డుపెట్టింది ?

One thought on “సమంత–రాజ్ నిడిమోరు గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్ .

Comments are closed.