నటి సమంత మోడలింగ్ నుంచి అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టింది. తన తొలి సినిమా ఏ మాయ చేసావే తోనే మంచి పేరు, అభిమానులు, క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సమంత, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, కొంతకాలం తర్వాత మనస్పర్థల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడింది. దీని చికిత్స కోసం కొన్ని నెలలు సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమె అన్ని సమస్యల నుంచి బయటపడుతూ మళ్లీ సినిమాల్లో బిజీగా మారింది.
సమంత సిడ్నీలో ఓ ఈవెంట్‌లో పాల్గొని, “కండిషన్లు పెట్టడం నాకు నచ్చదు. నాకు ఇష్టమైనట్టు నేను జీవించాలనుకుంటున్నాను. మనకు నచ్చినట్టు జీవించినప్పుడే నిజమైన విజయాన్ని పొందవచ్చు. విజయాలు మాత్రమే కాదు, ప్రయత్నించడమే సక్సెస్‌లో భాగం,” అని వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సమంత, నాగ చైతన్య విడాకుల కారణంగా అక్కినేని కుటుంబం ఆమె పాత్రలపై కండిషన్లు పెట్టిందన్న వ్యాఖ్యలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. విడిపోయి నాలుగేళ్లు గడిచినా, వారి గురించి వార్తలు నెట్టింట్లో మార్మోగుతూనే ఉన్నాయి.

One thought on “కండిషన్లు నచ్చవు – సమంత వ్యాఖ్యలు హాట్ టాపిక్”
Comments are closed.