రోడ్ సేఫ్టీ: ఆకట్టుకుంటోన్న షార్ట్ ఫిల్మ్

రోడ్డు భద్రతపై గుజరాత్ ఆర్టీఓ అధికారులు రూపొందించిన ఓ అవగాహన వీడియో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం 57 సెకన్ల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్ హెల్మెట్ అవసరాన్ని తెలియజేస్తూ తెరకెక్కించారు. ఇందులో ఎటువంటి మాటలు ఉండవు, కేవలం కళ్ళతో మాత్రమే విషయాన్ని చెప్పే తీరు నెటిజన్లను కదిలిస్తోంది. హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ పై తండ్రీ కూతురు ప్రయాణిస్తూ ఆర్టీఓ అధికారి కంటపడడంతో వీడియో మొదలవుతుంది. ఆ రోజు చూసీచూడనట్లు వ్యవహరించిన ఆ అధికారి.. రెండో రోజు మాత్రం కొంచెం అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. మూడో రోజు వారిద్దరూ హెల్మెట్ ధరించి రోడ్డుపైకి రావడంతో ఆ అధికారి చిరునవ్వులు చిందించడంతో వీడియో ముగుస్తుంది. ఒకే వీడియోలో హెల్మెట్ ఆవశ్యకతను, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థాన్ని చెప్పారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరూ చూసేయండి…

Read More : అమెరికాలో మూడో పార్టీ అవసరం: KA Paul