ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడిగా నిలిచాడు.
మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన పరాగ్, ఆ తర్వాతి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మరో సిక్స్ బాది ఈ ఘనత సాధించాడు. మొత్తం 45 బంతుల్లో 95 పరుగులు చేసిన పరాగ్, త్రుటిలో శతకం మిస్ అయ్యాడు.
అయితే పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ చేసినా, రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా బయటపడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో వారి ఖాతాలో ఉన్న 6 పాయింట్లకు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా 4 పాయింట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్లేఆఫ్స్ అవకాశాలు ముగిశాయి.
ఇక కేకేఆర్ ఈ విజయంతో 11 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి చేరింది. అయితే ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవడం తప్పనిసరి.
Read More : నేడు బెంగళూరులో కీలక మ్యాచ్, ప్లేఆఫ్ ఆశలు నిలబెట్టుకునే పోరు

One thought on “ఐపీఎల్ చరిత్రలో రియాన్ పరాగ్ అరుదైన ఘనత”
Comments are closed.