లక్నోకు చెందిన యువతి రభిక సోనీ, సోషల్ మీడియాలో రీల్ వీడియో కోసం శృంగార ప్రదర్శన చేస్తూ రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యతో ప్రయాణికుల భద్రతకు భంగం ఏర్పడిందని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే నియమాలను ఉల్లంఘించిన ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సహకరించకుండా రభిక సోనీ తప్పుదోవ పట్టిస్తున్నట్టు సమాచారం.
అంతేకాకుండా, ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఆమె మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సొషల మీడియాలో లైక్స్ కోసం ఇలాంటి ప్రవర్తనలను పోలీసులు తీవ్రంగా ఖండిస్తూ, రైల్వే ప్రాంగణంలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Read More : రంగారెడ్డి జిల్లాలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేసిన యువతి..

One thought on “రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ?”
Comments are closed.