తమిళ నటుడు రవి మోహన్ వివాహ వివాదంపై స్పందన.

తమిళ నటుడు రవి మోహన్ తన భార్య ఆర్టీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ గురువారం ఒక కొత్త ప్రకటన విడుదల చేశారు. దంపతులు ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు మీద పోరాటం జరుపుకుంటుండగా, పరస్పరం ఒకరిపై ఒకరు భావోద్వేగ, శారీరక వేధింపుల ఆరోపణలు చేస్తూ పలు పబ్లిక్ ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్నారు.

గత వారం ఆర్టీ తన ప్రకటనలో రవిని ‘లేనిపోని తండ్రి’గా అభివర్ణించిన నేపథ్యంలో, తాజాగా రవి మోహన్ తన నాలుగు పేజీల ప్రకటనలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “నా మునుపటి వైవాహిక బంధాన్ని ఎవరు చీప్ సింపతీకి వాడుకునేలా అనుమతించను. ఇది ఆట కాదు. నా జీవితం, నా నిజం, నా మానసిక ఆరోగ్యం,” అంటూ రవి స్పష్టం చేశారు.

అతని ప్రకటనలో భాగంగా, “ఆర్టీ మా పిల్లలను ఆర్ధిక ప్రయోజనం కోసం, ప్రజల అనుకంపను పొందేందుకు ఒక పబ్లిక్ నేరేటివ్‌గా వాడుతున్నారు. విడాకుల తర్వాత పిల్లల్ని నన్ను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.

“వివాహ బంధంలో నేను అనేక సంవత్సరాల పాటు శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్ధిక వేధింపులకు గురయ్యాను. నా స్వంత తల్లిదండ్రులను కలవడానికి కూడా అవకాశమిలేకుండా ఒంటరితనంలో బంధించబడ్డాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ బంధం నుండి తప్పుకోవడం తేలికైన నిర్ణయం కాదు. కానీ జీవితం అసహనంగా మారిన తరుణంలో, బతకడానికి నేను తీసుకున్న ధైర్యమైన అడుగు అది,” అని రవి చెప్పుకొచ్చారు.

తన నిశ్శబ్దతను ‘బతికుండేందుకు తీసుకున్న వ్యూహం’గా అభివర్ణించిన రవి, “నేను ఈ కల్పించిన ఆరోపణలను ఖండిస్తున్నాను. న్యాయంపై నమ్మకంతో, గౌరవంతో, ధైర్యంగా నా నిజం కోసం నిలబడతాను” అని అన్నారు.

అంతేగాక, తన భార్య గతంలో ‘ఎక్స్ వైఫ్ అనే పదాన్ని వాడొద్దని’ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “నేను ఇంటిని వదిలిన రోజే ఆ పదాన్ని నా హృదయంలో అమర్చుకున్నాను. అది చివరి వరకు అలాగే ఉంటుంది” అని పేర్కొన్నారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 9న రవి మోహన్, ఆర్టీతో తన బంధం ముగుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన తన అనుమతి లేకుండా విడుదల చేయబడిందని ఆర్టీ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల రవి మోహన్ గాయకురాలు, తన థెరపిస్ట్ అయిన కెనిషా‌తో సంబంధం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరూ చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలిసి కనిపించడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి.

“ఇన్నాళ్లు వెనక నుండి కత్తి పడుతూ వచ్చింది.. ఇప్పుడు ఎదురు నుండి పడుతోంది గనక ఆనందంగా ఉంది” అంటూ భావోద్వేగపూరితంగా ముగిస్తూ – “ఇది నా మొదటి ప్రకటన, చివరిది కూడా” అని రవి పేర్కొన్నారు.

Read More : రాంగ్ రూట్ కేసు – ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం

One thought on “తమిళ నటుడు రవి మోహన్ వివాహ వివాదంపై స్పందన.

Comments are closed.