హాలీవుడ్ దిగ్గజాలతో రానా సందడి!

Rana Daggubati at Miami Grand Prix

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల అమెరికాలోని మియామి గ్రాండ్ ప్రీ ఈవెంట్‌కు హాజరయ్యారు. హాలీవుడ్ దిగ్గజాలు 50 సెంట్, ఆస్కార్ విజేత గూడింగ్ జూనియర్‌తో కలిసి కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సతీమణి మిహీకా బజాజ్‌తో కలిసి అమెరికా వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న రానా.. ఈవెంట్‌లో వైట్ డ్రస్, బ్లాక్ గాగుల్స్‌తో స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. రానాతో పాటు అనిరుధ్ రవిచందర్, హర్ష వడ్లమూడి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

అమెరికా మార్కెట్‌లో లోకా లోకా సంస్థ విస్తరణ లక్ష్యంగా రానా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ‘ఆల్ రౌండర్ రానా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘లీడర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన రానా ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా, నటుడిగా పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే రెజిల్ మేనియా ఈవెంట్‌కు హాజరైన తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం అందుకున్నాడు.

Read More