ది ఇంట్రడక్షన్ ఫస్ట్ గ్లింప్స్ రేపు విడుదల

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న “రామాయణం: ది ఇంట్రడక్షన్” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో విడుదల చేయనున్నారు. సినిమా ప్రేమికులకు ఇది ఒక ప్రత్యేక అనుభవంగా నిలవనుంది.

ఈ ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే వారు www.shreyasgroup.net వెబ్‌సైట్‌ ద్వారా తమకు కావలసిన ఉచిత పాస్‌లను ముందుగా బుక్ చేసుకోవచ్చు. సినిమా మేకర్స్ అందిస్తున్న ఈ తొలి చూపు ద్వారా సినిమాలోని గ్రాండ్ విజువల్స్, కథా నేపథ్యం పై ఓ ముప్పావు చూపుని అందించనున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో ప్రతీ పాత్ర, ప్రతీ క్షణం విజువల్ మ్యాజిక్‌గా మారబోతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయ పౌరాణిక ఇతిహాసాన్ని ఆధునిక టెక్నాలజీతో మేళవించి, ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంగా ఈ సినిమా రూపొందుతోంది.

Read More : తీవ్ర అనారోగ్యంలో ఫిష్ వెంకట్