భారతీయ పురాణ ఇతిహాసమైన ‘రామాయణం’ ఆధారంగా ఇప్పటి వరకు అనేక సినిమాలు రూపొందినప్పటికీ, ఇటీవల ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆ చిత్రం, కథానాయకుల రూపకల్పన, సాంకేతిక ప్రతిపాదనల విషయంలో ప్రేక్షకులను నిరాశపరిచిందనే అభిప్రాయాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్న ‘రామాయణ’ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది, ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్‌లను రంగంలోకి దింపి, రామాయణ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సహా ప్రతీ అంశంలోనూ అత్యధిక ప్రమాణాలను పాటిస్తూ, హాలీవుడ్ సినిమాలతో పోటీపడేలా రూపొందిస్తున్నారు.
సంగీత విభాగానికి సంబంధించి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స జిమ్మర్ కలిసి పని చేయడం విశేషం. ఈ మహత్తరమైన రామాయణ ప్రాజెక్ట్ లో భాగంగా ‘రామాయణ పార్ట్ 1’ను 2026 దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ను 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

One thought on “రామాయణాన్ని హాలీవుడ్ టచ్‌లో తెస్తున్న రెహమాన్!”
Comments are closed.