కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈసారి రజనీకాంత్‌తో కలసి పనిచేయడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుందని లోకేష్ పలు సందర్భాల్లో వెల్లడించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది.
సినిమా ప్రమోషన్లో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న లోకేష్ కనగరాజ్, తెలుగు మీడియాతో కూడా మాట్లాడారు. కూలీ షూటింగ్ సందర్భాలను గుర్తుచేసుకుంటూ, సెట్స్‌లో శృతి హాసన్ నటన చూసి రజనీకాంత్ స్వయంగా స్వీట్స్ తెప్పించి ఆమెకు తినిపించారని వెల్లడించారు. అయితే శృతి హాసన్ పాత్ర ఏంటన్నది ఇంకా గోప్యంగానే ఉంచారు.
ఇక కూలీ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండటం మరో ప్రత్యేకత. ఇందులో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున కీలక పాత్రలో నటించగా, ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. దీంతో రజనీకాంత్‌తో నాగార్జున పోటీపడే సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కూలీ సినిమాకు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూలీకి వార్ 2 సినిమా నుంచి గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ రజనీకాంత్ ఈ చిత్రంతో తన సూపర్ స్టార్ స్టామినాను మరోసారి రుజువు చేస్తారని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.
Read More : సంధ్య థియేటర్ తొక్కిసలాట ?

One thought on “రజనీకాంత్‌ను మెప్పించిన నటన”
Comments are closed.