ఆపరేషన్ సిందూర్‌లో సైన్యానికి స్వేచ్ఛ లేదా?

దేశ భద్రత, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశం కోసం పోరాడే ప్రతి జవానులోనూ పులి ధైర్యం కనిపిస్తుందని, అలాంటి పులికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే, ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మన సైనికుల చేతులు కట్టేసిందని తీవ్ర విమర్శలు చేశారు.

“మన సైన్యం, నావికాదళం, వైమానిక దళం వంటి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలను సక్రమంగా వినియోగించాలంటే నూటికి నూరు శాతం రాజకీయ సంకల్పం ఉండాలి. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వ వైఖరి సైనికుల ఉత్సాహాన్ని తగ్గించేలా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

దేశ భద్రత విషయంలో అర్థంతరమైన చర్యలు సరిపోవని, సమగ్ర వ్యూహం, దృఢమైన రాజకీయ నిర్ణయాలు అవసరమని రాహుల్ గాంధీ హితవు పలికారు.

Read More : ఆపరేషన్ సిందూర్‌పై మోదీ స్పందన