క్వార్ట్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనుమతులు లేని క్వార్ట్జ్ రవాణాకు ప్రతి టన్నుకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా అక్రమంగా వచ్చిన నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మళ్లించినట్లు వెల్లడైంది.
అనిల్ కుమార్ తో కలిసి శ్రీకాంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారాలు చేసినట్లు సమాచారం. గూడూరు-చెన్నూరు రోడ్డులో “గ్రీన్ మెడోస్” పేరిట 100 ఎకరాల్లో, నాయుడుపేట హైవే వెంట “స్వర్ణముఖి స్మార్ట్ సిటీ” పేరుతో 50 ఎకరాల్లో రియల్ వెంచర్లు ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ మణికొండ అల్కాపురిలో “హెవెన్లీ హోమ్స్,” తుర్కయాంజల్ వద్ద “గ్రీన్ మెడోస్ హౌసింగ్ కనస్ట్రక్షన్స్” పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో మరిన్ని కీలక ఆధారాలు వెలుగులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
Read More : తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి కోర్టులో భావోద్వేగం

One thought on “క్వార్ట్జ్ స్కాం విచారణలో వైసీపీ నేతల కీలక పాత్ర బహిర్గతం”
Comments are closed.