Punjab Kings vs Mumbai Indians IPL 2025 Qualifier 2 : ముంబై పై ‘పంజా’బ్ ఘన విజయం

ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. తమ చివరి మ్యాచ్‌లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు ఈ మ్యాచ్‌లో మాత్రం విజృంభించింది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈనెల 3న జరిగే ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్‌ (44), తిలక్‌ వర్మ (44), బెయిర్‌స్టో (38), నమన్‌ (37) పరుగులు చేశారు . ఒమర్జాయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి నెగ్గింది. నేహల్‌ వధేరా (48), ఇన్‌గ్లి్‌స (38) పరుగులతో ఆకట్టుకున్నారు. అశ్వనికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ నిలిచాడు.