హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్, సునీత దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కూతురు రావుల ప్రత్యూష (24), బీటెక్ పూర్తి చేసిన అనంతరం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తోంది. అయితే, ఎంతగానో కృషి చేసినా కేవలం కొద్దిమార్కుల తేడాతో పలుమార్లు ఉద్యోగ అవకాశాలు చేజారిపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఆ బాధను తట్టుకోలేక మనస్తాపంతో ఉరివేసుకొని దుర్మరణం చెందింది.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read More : మోదీ యుద్ధం ఆపేశాడు: ఖర్గే విమర్శ
